Home > Corona Updates > చైనా విందు వల్లే ప్రపంచానికి కరోనా..ఆ పార్టీలో 40వేల కుటుంబాలు!

చైనా విందు వల్లే ప్రపంచానికి కరోనా..ఆ పార్టీలో 40వేల కుటుంబాలు!

china

కరోనా వైరస్ తొలుత చైనాలోని వుహాన్ నగరంలో బ్రేక్ అవుట్ అయిన సంగతి తెల్సిందే. అక్కడి నుంచి వేగంగా వివిధ దేశాలకు వ్యాపించింది. అయితే, వుహాన్ లో కరోనా వైరస్ ఎలా బ్రేక్ అవుట్ అయిదని పరిశోధకులు శోధిస్తున్నారు. వారి పరిశోధనల్లో కరోనా వ్యాధి వుహాన్ లో విస్తారంగా వ్యాపించడానికి కారణం 'ది భైబూటింగ్ విందు' అని తాజాగా సీఎన్‌ఎన్‌ ప్రతినిధి ఫరీద్‌ జకారియా నిర్వహించిన పరిశోధనలో తేలింది.

బైబూటింగ్ కమ్యూనిటీకి చెందిన 40వేల కుటుంబాలు కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 19వ తేదీన పాట్ లక్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో రికార్డు స్థాయిలో 13986 రకాల వంటకాలు వండి వడ్డించారు. ప్రతి ఏడాది ఇలాంటి విందులు నిర్వహిస్తుంటారు. అయితే, అప్పటికే కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుండడంతో ఈ విందుకు అనుమతి ఇవ్వొద్దని కొందరు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా కుదరలేదు. ఈ కమ్యూనిటీ ప్రజలు అక్కడ 57 భవనాల్లో నివసిస్తున్నారు. ఈ విందు జరిగిన 15 రోజుల్లోపే 33 భవనాల్లో కరోనా వ్యాపించింది. అప్పటికే ఈ 40వేల కుటుంబాలకు చెందిన వారిలో చాలా మంది విందులో పాల్గొన్న తరువాత వివిధ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని విమర్శలు వస్తున్నాయి.

Updated : 27 May 2020 5:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top