భారతదేశంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి.ఎన్నో అందమైన, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. జీవితాంతం తిరిగినా ఇంకా చూడాల్సిన ఎన్నో ప్రకృతి అందాలు మన దేశంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ ప్రదేశం కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ ప్రదేశం మన దేశానికి చివరి రోడ్డు మార్గం. తమిళనాడుకు చెందిన పాంబన్ దీవుల్లో ఆగ్నేయ ప్రాంతంలో ధనుష్కోడి అనే పట్టణంలో నిర్జన అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశ చివరి భూమిగా అభివర్ణిస్తారు.ఎందుకంటే ఈ ప్రాంతంతోనే మన భారతదేశ రోడ్డు ముగుస్తుంది. ఈ ధనుష్కోడి నుంచి 31 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే శ్రీలంక దేశం వచ్చేస్తుంది.
కాగా.. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో రోడ్లు, దాని పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి. డ్రోన్ ద్వారా చూస్తే ఒక పెద్ద శివలింగంలా కనిపిస్తుంది. ట్విట్టర్లో షేర్ చేసిన కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 46 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
Dhanushkodi – The last road of Bharat pic.twitter.com/ZZcCHgEOrA
— Colours of Bharat (@ColoursOfBharat) July 24, 2022