పానకం రికార్డ్.. మంగళాద్రిలో వేలం.. రూ.కోటి దాటింది... - MicTv.in - Telugu News
mictv telugu

పానకం రికార్డ్.. మంగళాద్రిలో వేలం.. రూ.కోటి దాటింది…

October 25, 2018

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో కొలువైన పానకాల స్వామికి భక్తుల తాకిడి అధికంగా పెరిగింది.  మంగళగిరిలో స్వయంభువుగా వెలసిన పానకాల స్వామి నోటిలో భక్తులు పానకం పోయడం సంప్రదాయం. పానకం సగం స్వామీ తీసుకుని మిగతాసగం తిరిగి భక్తులకు ఇవ్వడం ప్రత్యేకత. ఈ ఏడాది పానకం రికార్డు స్థాయిలో కోటీ రూపాయలను దాటింది. పానకం విక్రయం కోసం శ్రీకృష్ణదేవరాయల ముఖమండపంలో  టెండర్‌కమ్ బహిరంగంగా వేలం నిర్వహించారు. గత ఏడాది రూ. 25 లక్షలకు పలుకగా, ఈ ఏడాది రూ. 1,08,09,999 ధర పలికింది.Last year At Rs 25 lakh this year, 1,08,09,999 price. Mangalagire panakala swamy templeపానకంతో పాటు కొబ్బరికాయలు, దీపారాధనలు, పూజాద్రవ్యాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఫోటోలు తదితరాలను విక్రయించేందుకు కూడా వేలం నిర్వహించారు. గత ఏడాది రూ. 82.90 లక్షలకు హక్కులను విక్రయించిన అధికారులు, ఈ ఏడాది  భారీ మొత్తం రావడంతో భక్తులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 7 వరకూ ఈ హక్కులు చెల్లుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.