Home > Featured > సరి అయిన టైమ్ కు నిద్ర పోకపోతే హార్ట్ ఎటాక్ గ్యారంటీ

సరి అయిన టైమ్ కు నిద్ర పోకపోతే హార్ట్ ఎటాక్ గ్యారంటీ

 late night sleep causes heart attcks

హ్యాపీగా 7 నుంచి 8 గంటల నిద్ర వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలుసు. ఇది మీ ఇమ్యూనిటీని, బరువుని, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ 7 లేదా అంతకంటే ఎక్కువ గంటల మంచి నిద్ర వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గి, మీ మానసిక స్థితి మెరుగ్గా మారుతుంది. మీ శరీరం బాగా విశ్రాంతి తీసుకుంటే మరింత మెరుగ్గా ఆలోచించగలరు.

శరీరం అలసిపోయినప్పుడు నిద్ర పోతే వచ్చే రిలాక్సేషన్ వేరు. నిద్ర పోవడం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ రిలాక్స్ అయి తిరిగి చక్కగా పనిచేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో ఉంటాయి. అందుకే మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సంకేతం అంటారు. మంచి నిద్ర వల్ల చాలా ఆరోగ్య సమస్యలతో పాటు మనసుని కూడా ప్రవాంతంగా ఉంచుకోవచ్చు. నిద్రపోవడం వల్ల కండరాలు కూడా చక్కగా పని చేస్తాయి.

నిద్ర ఇంత ముఖ్యమని తెలిసినా నేడు చాలా మంది దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. పని ఒత్తిడి, బిజీ లైఫ్, సోషల్ మీడియా అడిక్షన్, మానసిక, శారీరక సమస్యలు…కారణాలు ఏమైనా నిద్ మాత్రం సరిగ్గా పోవడం లేదు. రోజంతా బిజీగా ఉండేవారు సాయంత్రం కాగానే ఇంటికొచ్చి రిలాక్స్‌గా డిన్నర్ చేసి మళ్ళీ మొబైల్స్ పట్టుకుని వాటితో టైమ్ పాస్ చేస్తున్నారు. దీంతో సరైన సమయంలో నిద్ర రాక అర్ధరాత్రులు దాటాక పడుకోవడం, ఉదయాన్నే లేట్‌గా లేవడం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిదికాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ గుండెపై పడుతుందని చెబుతున్నారు.

నిద్ర మీద జరిగిన పరిశోధనలు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాయి. అదేంటంటే మనం ఎప్పుడు నిద్రపోతున్నామనేది మన గుండె ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని అవును.. అధ్యయనాల ప్రకారం, నిద్ర పోయే సమయం గుండె నొప్పుల నుంచి మనల్ని కాపాడగలదు. కానీ, సరైన వేళల్లో నిద్ర పోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది.

అర్దరాత్రి దాటాక పడుకునే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 25 శాతం పెరిగింది.ఏవేవో చేస్తూ టైమ్ పాస్ చేస్తూ నిద్ర సరిగ్గా పోకపోవడం, మార్నింగ్ లేట్‌గా లేచి పనులకు హడావిడిగా వెళ్ళడం, ప్రతి పనీ త్వరత్వరగా అవ్వాలని కంగారు పడడంతో ఆ ఒత్తిడి గుండె సమస్యల రిస్క్ పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.

రాత్రుళ్ళు త్వరగా పడుకోవడం వల్ల ఉదయాన్నే లేవొచ్చు. దీని వల్ల బోలెడు సమయం ఉంటుంది, ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. రాత్రి 10, 11 గంటలలోపే నిద్రపోయే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, 11 నుంచి అర్ధరాత్రిలోపు నిద్రపోయేవారికి 12 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

యూకెలోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన డాక్టర్ డేవిడ్ ప్లాన్స్ దీనికి కారణాలు కూడా వివరించారు. రోజూ సరైన సమయంలో నిద్రపోవడం, లేవడం మంచిదని చెబుతున్నారు. నిద్రకి సరైన సమయం రాత్రులే కానీ, అర్ధరాత్రి కాదని చెబుతున్నారు. పడుకోవలసిన టైమ్ లో మొబైల్స్ చూడడం శరీరానికి మంచిది కాదని, ఈ అలవాటు వల్ల శరీర అస్తవ్యస్తంగా మారి ప్రమాదంగా తయారవుతుందని ఆయన చెబుతున్నారు.

నిద్రలేకపోవడం గుండెకే కాదు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా మంచిది కాదు. నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి బరువు పెరగడం, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, రక్తపోటు, షుగర్ వ్యాధి, ఇలా అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నవాళ్ళమవుతాం. కాబట్టి, చక్కగా నిద్రపోయి ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోండని చెబుతున్నారు నిపుణులు.

ఈరోజు వరల్డ్ హ్యాపీ స్లీప్ డే. కనీసం ఈరోజు నుంచైనా సరిగ్గా నిద్రపోవాలని అందరం ప్లడ్జ్ తీసుకుందాం. మన ఆరోగ్యాన్నే మనమే కాపాడుకుందాం. ఇన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర పట్టకపోతే దానికి సరైన చికిత్స్ అవసరం. ధ్యానం చేయడం, పడుకునే ముందు పాలు తాగడం లాంటివి కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి.

Updated : 17 March 2023 1:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top