భారత్‌లో లక్ష మార్కు దిశగా కరోనా..ఒక్కరోజే 5,242 కేసులు
భారత్‌లో కరోనా రోజుకో రికార్డును సృష్టిస్తోంది. ఇటీవల చైనాను దాటేసి కేసులు నమోదు చేయగా.. లక్ష మార్కు దిశగా సాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక కేసులు బయటపడ్డాయి. గడచిన 24 గంటల్లో 5,242 మందికి వైరస్ లక్షణాలు గుర్తించారు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న 157 మంది వైరస్ దాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం96,169 మందికి వ్యాధి సోకింది. మరణాల సంఖ్య 3,029 గా ఉంది. 36,824 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 56,316 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 48 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు 4,801,532 మంది వ్యాధి బారిన పడ్డారు. 316,660 మంది మరణించారు. 1,858,106 మంది కోలుకుకొని డిశ్చార్జి అయ్యారు. అమెరికా,స్పెయిన్, రష్యా, యూకే, జర్మనీ, బ్రెజిల్,ఇటలీ దేశాల్లో ఈ వైరస్ దాటి ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత్‌లో అయితే మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ ఒక్కరోజే 1,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య 734కు చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 19,967 మంది వైరస్ బారిన పడ్డారు.