కనికరించని కరోనా.. భారత్‌ @ 1,58,33 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కనికరించని కరోనా.. భారత్‌ @ 1,58,33 కేసులు

May 28, 2020

Latest COVID-19 Cases in India

దేశంలో లాక్‌డౌన్‌ 4.0 ముగిసేందుకు వచ్చినా కరోనా వ్యాప్తిలో మార్పు రావడం లేదు. ఓ వైపు వలస కూలీలు సొంత ఊళ్లకు పయణం అవుతుండటం, సడలింపులతో రోజు రోజుకు వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. హాట్ స్పాట్లు గుర్తించినా లాభం లేకపోయింది. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్  విడుదల చేసింది. గడిచన 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కొత్తగా కరోనా లక్షణాలను గుర్తించారు. 194 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే 107 మంది మరణించారు. దీంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. 

ఇప్పటి వరకు దేశంలో 1,58,333 మందికి చేరగా, మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. 67692 మంది వైరస్‌ను జయించడంతో 86,110 మంది ఇంకా ఆయా కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 57,000 కేసులు నమోదయ్యాయి. 1900 మంది మృతి చెందారు. తమిళనాడులో 18 వేల మందికి సోకింది. దేశ రాజధాని ఢిల్లీలో 15,275 మంది వైరస్ బారిన పడ్డారు.ప్రపంచ వ్యాప్తంగా 5,781,650 మందికి కరోనా సోకింది. వీరిలో 3,56,839 మంది చనిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలోనే లక్షకు పైగా మంది మరణించారు.