మృతదేహాల్లో 6 గంటల కంటే ఎక్కువగా కరోనా వైరస్ ఉండదు - MicTv.in - Telugu News
mictv telugu

మృతదేహాల్లో 6 గంటల కంటే ఎక్కువగా కరోనా వైరస్ ఉండదు

July 3, 2020

coronavirus

కరోనా వైరస్ మృతుల పట్ల ప్రజల్లో ఎన్నో అపోహలున్న విషయం తెల్సిందే. కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే తమకు కరోనా వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో బంధువులు, స్నేహితులు కరోనాతో మరణించినా కూడా ఆకహృ చూపు కోసం వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మృత దేహాలపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి.

కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాల్లో 6 గంటల తర్వాత వైరస్ ఉండదని, ప్రజలు వారికి అంత్యక్రియలను అడ్డుకుని ఇబ్బందులు కలుగజేయవద్దని వెల్లడించారు. మృతదేహాల విషయంలో అపోహలు, ఆందోళనలు వద్దన్నారు. కరోనా వల్ల ఒక మరణం సంభవిస్తే 660 కేసులు ఉన్నట్లు లెక్కని వివరించారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవన ప్రాంగణంలో శుక్రవారం జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.