తెలంగాణ ఇంటర్ ఫలితాలపై తాజా అప్‌డేట్.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై తాజా అప్‌డేట్..

June 24, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాలకు సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ముందుగా ఇంటర్ ఫలితాలను ఈ నెల 25న ప్రకటిస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫలితాలను ఈ నెల‌ 26న వెల్లడించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పునకు కారణం.. కొంతమంది విద్యార్థుల‌ మార్కులను కంప్యూటర్‌‌లో ఫీడ్ చేస్తున్న క్రమంలో తప్పులు దొర్లయని, వాటిని స‌రిచేసేందుకు సమయం పడుతుందని అధికారులు సబితా ఇంద్రారెడ్డికి తెలిపారట. దాంతో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఆలస్యమైనా ఫ‌ర్వాలేదు గాని, త‌ప్పులు మాత్రం దొర్ల‌కుండ చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారట.

గత సంవత్సరం క‌రోనా కారణంగా ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌ర ప‌రీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 49 శాతం రావడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డుపై మండిపడుతూ, ధర్నాలు, ర్యాలీలు చేశారు. చివ‌ర‌కు చేసేది ఏమిలేక కనీస మార్కులతో ప్రతి విద్యార్థిని, విద్యార్థులను పాస్ చేశారు. ఈసారి అలాంటి తప్పిదాలు ఏమీ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఫ‌లితాల‌ను పరిశీలించి స‌క్ర‌మంగా ప్ర‌క్రియ ముగిసింది అని నిర్థారించుకుంటేనే ఈ నెల 26వ తేదీన ఫలితాల‌ను విడుద‌ల చేయాల‌ని సబితా ఇంద్రారెడ్డి అధికారులకు చెప్పారట.

మ‌రోపక్క తెలంగాణ‌లో పదవ తరగతి పరీక్షా ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిని, విద్యార్థులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ పదోవ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి, అధికారులు అన్ని కుదిరితే ఈ నెల 30లోపు విడుదల చేస్తామ‌ని చెప్పారు. జ‌వాబు ప‌త్రాల‌ మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంత‌రం టెక్నిక‌ల్‌గా అన్ని అంశాల‌ను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.