ఏపీలో వలస కూలీలపై విరిగిన లాఠీ.. కారణం ఇదే  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో వలస కూలీలపై విరిగిన లాఠీ.. కారణం ఇదే 

May 16, 2020

gnbfgcb

ఏపీలో వలసకూలీలపై పోలీసులు లాఠీ ఝులిపించారు. శనివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇది చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డుపై పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

యూపీ ఒడిశా,మధ్యప్రదేశ్, జార్ఖండ్, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఈనెల 15 నడుచుకుంటూ సొంత ప్రాంతాలకు బయలుదేరారు. ఈ విషయం సీఎస్‌కు తెలియడంతో వారందరిని తాడేపల్లిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడే వారికి ఆహారం అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం టిఫిన్ చేసే సమయంలో 150 మంది కూలీలు తమ సైకిళ్లు తీసుకొని ఊరికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారిని విజయవాడలోని కనకదుర్గమ్మ వంతెన వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. తర్వాత వారిని విజయవాడ క్లబ్‌కు తరలించి వివరాలు నమోదు చేసుకున్నారు.