ఐఫోన్ ఫోన్లు త్వరలో మేడిన్ ఇండియా ట్యాగ్‌తో మార్కెట్లోకి రానున్నాయి. ఐఫోన్ 13 మోడల్ తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రారంభించింది. దీంతో పాటు ఐఫోన్ 12 కూడా ఇక్కడే మొదలుపెట్టనుందని సమాచారం. అయితే ఈ సిరీస్‌లో ఐఫోన్ 13 మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్‌లు విదేశాల నుంచే దిగుమతి అవుతాయి. ఐఫోన్ 13 మినీ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ 79,900 గా ఉంది. అమెజాన్, ఫ్టిప్ కార్ట్ వంటి సైట్లలో రూ. 73,900 లకు లభిస్తోంది. ఉత్పత్తి ఇక్కడే అవుతున్నా.. ధరలో మాత్రం ఏమాత్రం మార్పులు లేవు. పండుగ ఆఫర్లప్పుడు ఏమైనా తగ్గే అవకాశం ఉంది. కాగా, ఫాక్స్‌కాన్‌తో పాటు పెగాట్రాన్, విస్టాన్లతో భాగస్వామ్యాలను కుదుర్చుకొని ఐఫోన్ల తయారీని అప్పగించింది యాపిల్ సంస్థ.