రూ. 2400కే లావా స్మార్ట్‌ఫోన్.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 2400కే లావా స్మార్ట్‌ఫోన్..

March 23, 2018

స్మార్ట్‌ఫోన్ల ధరలు వేగంగా తగ్గుతున్నాయి. టెక్నాలజీ ముందంజ, కంపెనీల మధ్య గొంతుకోత పోటీతో తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. లావా కంపెనీ తన తొలి దేశీయ ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను జడ్‌50 పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’  ఆఫర్ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2400కే అమ్ముతోంది. అసలు ధర రూ. 4400. దీన్ని దేశంలో 10వేల రిటైల్‌ షాపులతోపాటు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.

జడ్50 బ్లాక్‌, గోల్డ్‌ రంగుల్లో లభిస్తోంది. రెండేళ్ల వారంటీతోపాటు వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్(తొలి ఏడాదివరకే) కూడా ఉంటుంది. ఈ ఫోన్‌పై ఎయిర్‌టెల్‌ రూ.2000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌ పొందాలంటే  తొలి 18 నెలలు రూ.3500తో, 19 నుంచి 36 నెలల మరో రూ.3500తో ఎయిర్‌టెల్‌ అకౌంట్లలో రీచార్జ్ చేయించుకోవాలి.

జడ్‌50 ఫీచర్లు

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో(గో ఎడిషన్‌), 4..5 అంగుళాల డిస్‌ప్లే, 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 5 మెగాపిక్సెల్‌ రియర్‌, ఫ్రంట్‌ కెమెరా సెన్సర్లు, 2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌. క్వాడ్‌-కోర్‌ 1.1గిగాహెడ్జ్‌ మీడియాటెక్‌ ఎంటీ6737ఎం ఎస్‌ఓసీ.