చవితి రోజున ‘లవ’ టీజర్ - MicTv.in - Telugu News
mictv telugu

చవితి రోజున ‘లవ’ టీజర్

August 23, 2017

జూనియర్ ఎన్టీఆర్ , డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘జై లవకుశ’ . ఈ సినిమాలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన జై.. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ నెల 25న వినాయక చవితి  సందర్బంగా  లవకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ నెల చివరన కుశ టీజర్ విడుదల చేయనున్నారు. పాటల ఆడియోను సెప్టెంబర్ 3న హరికృష్ణ బర్త్ డే సందర్బంగా విడుదల చేస్తున్నట్టు సమాచారం.  ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమా ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించి మూవీపై భారీ హైప్ తీసుకువచ్చేలా నిర్మాత కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్లుగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.