జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జై లశకుశ’ మూవీ నుంచి మరో టీజర్ రిలీజైంది. ‘‘హాయ్ నా పేరు లవకుమార్.. ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాను.. ’’ అంటూ జూ. ఎన్టీయార్ ఇందులో తనను పరిచయం చేసుకున్నాడు. ఈ సినిమాలో అతడు జై, లవ, కుశగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
బాబీ దర్శకత్వంలలో రూపొందుతున్నఈ సినిమా దసరాలకు విడుదల కానుంది. జూ. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదితా థామస్ జోడీగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి జై టీజర్ ను విడుదల చేశారు. దానితోపాటు లవ టీజర్ కూ మంచి స్పందన వస్తోంది.