రూ. 3,899కే స్మార్ట్ ఫోన్ మీ సొంతం..  - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 3,899కే స్మార్ట్ ఫోన్ మీ సొంతం.. 

October 22, 2019

Mobile .

అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చింది. తన బ్రాండ్ నుంచి ‘లావా జెడ్ 41’ పేరుతో మంగళవారం కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సపోర్ట్ చేసే విధంగా దీన్ని తయారు చేశారు. మిడ్‌నైట్‌ బ్లూ, యాంబర్‌ రెడ్‌  రంగుల్లో వినియోగదారులకు అందించనున్నారు. దీని ధర కూడా కేవలం రూ. 3,899గా నిర్ణయించారు. ఇంత వరకు ఏ స్మార్ట్ ఫోన్‌లో ఇంత తక్కువ ధరకు ఇన్ని ఫీచర్స్ లభించలేదని ఆ సంస్థ ప్రతినిధి తేజిందర్ సింగ్ తెలిపారు. యూజర్లకు కావాల్సిన అన్ని సదుపాయాలను దీంట్లో చేర్చినట్టు వెల్లడించారు. 

‘లావా జెడ్ 41’ ఫీచర్స్ : 

  • డిస్‌ప్లే : 5 అంగుళాలు
  • కెమెరా : 5 ఎంపీ
  • బ్యాటరీ : 2500 ఎంఏహెచ్‌
  • 1 జీబీ ర్యామ్‌, 16జీబీ  స్టోరేజ్‌
  • వర్షన్ : ఆండ్రాయిడ్