లావా కొత్త ఫోన్.. రూ. 5,774..ఫీచర్లు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

లావా కొత్త ఫోన్.. రూ. 5,774..ఫీచర్లు ఇవే

July 9, 2020

phon

చైనా ఫోన్లను బ్యాన్ చేయాలనే నినాదం ఊపందుకున్న తరుణంలో దేశీయ మొబైల్స్ తయారీదారు లావా.. జడ్‌61 ప్రొ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 5,774కే అందిస్తోంది. ధర తక్కువైనప్పటికీ ఫీచర్ల విషయంలో లావా ఏమాత్రం కోత విధించలేదు. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్ లకు ఏమాత్రం తగ్గకుండా ఫీచర్లను అమర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ఆంబర్ రెడ్ కలర్ లలో లభించనుంది.

 

లావా జడ్‌61 ప్రొ ఫీచర్లు…

 

* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌,

* 2జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

*  8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

* 3100 ఎంఏహెచ్ బ్యాటరీ.