లావణ్య త్రిపాఠికి 3 కోట్ల జరిమానా! - MicTv.in - Telugu News
mictv telugu

లావణ్య త్రిపాఠికి 3 కోట్ల జరిమానా!

October 28, 2017

అందచందాలతో అందర్నీ మెప్పిస్తున్న కథానాయిక లావణ్య త్రిపాఠి పెద్ద చిక్కులో పడింది. తమిళనాడు సినీ నిర్మాతలు ఆమెకు రూ. 3 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఓ మూవీకి ఒప్పుకుని తర్వాత చేతులెత్తేయడంతో వారు ఆమెను ఈ డబ్బు కక్కమన్నారు.

కోలీవుడ్ కథనాల ప్రకారం.. తెలుగులో విజయం సాధించిన ‘100% లవ్’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్‘ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో లావణ్యను హీరోయిన్‌గా తీసుకున్నారు నిర్మాతలు. అయితే వేరే సినిమాల వల్లో, లేక పాత్ర నచ్చకనో తెలియదు గాని ఆమె ఆ రొమాంటిక్ సినిమాలో నటించను అని చెప్పింది.  

అన్నీ సిద్ధమమై, షూటింగ్ కూడా మొదలెట్టేశాక ఆమె షాకివ్వడంతో నిర్మాతలు లబోదిబోమన్నారు. లావణ్య నిర్ణయం వల్ల తమకు రూ. 3 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు కట్టేంతవరకు తమిళ సినిమాల్లో నటించకుండా ఆమెపై నిషేధం విధించాలని కోరారు. లావణ్య స్థానంలో ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండేని తీసుకున్నారు.