Law professor gummadi Anuradha former mla narsaiah daughter interview
mictv telugu

తొలి ఆదివాసీ మహిళా ప్రొఫెసర్ గుమ్మడి అనురాధతో ముచ్చట

June 23, 2022

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నస్థానాలకు చేరుకున్న సామాన్యుల పిల్లలు చాలామందే ఉన్నారు. సామాన్యుల కోవలోకి రాని రాజకీయ నాయకుల పిల్లల సంగతి చెప్పాల్సిన పనేలేదు. రాజకీయ నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సామాన్యుల్లో అతి సామాన్యుడిగా ప్రజల మన్నన అందుకున్నారు.

ఆయన తన కుమార్తె అనురాధను కార్పొరేట్ స్కూళ్లలో కాలేజీల్లో కాకుండా సర్కారీ విద్యాసంస్థలో చదివించారు. తండ్రికి తగ్గ బిడ్డ అనిపించుకున్నఆమె చదువుల్లో సత్తా చాటి ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ పొందిన తొలి తెలుగు ఆదివాసీ మహిళ కావడం ఆమె ప్రత్యేకత.
కేవలం చదువులోనే కాకుండా విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న అనురాధ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది మైక్ టీవీ. ప్రస్తుతం బషీర్బాగ్లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న అనురాధ నేపథ్యం, ఆలోచనలు ఆమె మాటల్లోనే..