ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ మహిళా లాయర్ ముక్కు కొరికాడు మరో న్యాయవాది. ఈ ఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన న్యాయవాదులే ఇలా దారుణాలకు పాల్పడటమేంటని ప్రజలు నివ్వెరపోయారు .
వివరాల్లోకి వెళితే జ్వాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళా రోషనాబాద్ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. 2018లో ఇంటర్న్‌షిప్ నిమిత్తం లాయర్ చంద్రశేఖర్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. 6 నెలల తరువాత మహిళ ఇంటర్న్‌షిప్ ముగిసింది. దీంతో చంద్రశేఖర్ తన మనసులోని మాటను మహిళకు తెలిపాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోవాలని మహిళపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయినా ఆమె అతడి ప్రేమకు నో చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన న్యాయవాది కసి తీర్చుకోవాలనుకున్నాడు. సందర్భం కోసం వెయిట్ చేశాడు.
హోలీ వేడుకల్లో భాగంగా కోర్టు ఆవరణలో జరిగిన సంబరాల్లో మహిళా న్యాయవాదితో పాటు చంద్రశేఖర్ హాజరయ్యాడు. సంబరాలు ముగిసిన తరవాత కోర్టు నుంచి ఇవిటికి వెళ్తున్న మహిళను మార్గమధ్యలో అడ్డుకున్నాడు చంద్రశేఖర్. మరోసారి పెళ్లి చేసుకుంటావా లేదా అని ఒత్తిడి తీసుుకవచ్చాడు. మహిళా లాయర్ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన్ లాయర్ ఆమె ముక్కును కొరిక దాడి చేశాడు. ఈ ఘటనతో స్కూటీ మీది నుంచి మహిళ కిందపడిపోతవడంతో స్థానికులు అటుగా రావడం గమనించి చంద్రశేఖర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వెంటనే మహిళా లాయర్ స్థానిక పోలీస్ స్టేషనుకు వెళ్లి చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై బార్ అసోషియేషన్ స్పందించింది. మహిళా న్యాయవాదిపై మరోసారి అఘాయిత్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామంది.