హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. శివారెడ్డి అనే లాయర్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ తో కాల్చుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. శివారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతని స్వస్థలం వైఎస్సార్ కడప జిల్లా అని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.