న్యాయవాది నీచపు పని.. 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ - MicTv.in - Telugu News
mictv telugu

న్యాయవాది నీచపు పని.. 13 ఏళ్ల బాలిక కిడ్నాప్

May 4, 2020

Lawyer Kidnapped 13 Year Old Girl

న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. న్యాయాన్ని కాపాడాల్సిన వ్యక్తి అన్యాయానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడం కోసం ఆమెను కిడ్నాప్ చేశాడు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఇది చోటు చేసుకుంది. బాలిక బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కటకటాల్లోకి నెట్టారు. 

సొట్లమాయనూరుకు చెందిన న్యాయవాది కరుపయ్య (36) వేడచెందూర్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థినిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అతని తండ్రి, అత్తకు మాయమాటలు చెప్పి ఆమెను ఎత్తుకెళ్లాడు. ఈ వ్యవహారంపై బాలిక బంధువులు ఫిర్యాదు చేయడంతో కరుపయ్యను అరెస్టు చేయగా.. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. కాగా ఆ న్యాయవాదికి గతంలో పెళ్లి అయినా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడ విచారణలో వెల్లడైంది. దీంతో వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.