లక్ష్మీ మల్లేశం.. మైక్ టీవీ వెబ్ సిరీస్ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీ మల్లేశం.. మైక్ టీవీ వెబ్ సిరీస్ షురూ

January 1, 2022

00002

అందమైన పాటలతో, షార్ట్ ఫిలిమ్స్‌తో కోట్లాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్న మైక్ టీవీ ‘నిరుద్యోగ నటులు’ వెబ్ సిరీస్ చిత్రాలతోనూ అలరించింది. తాజాగా ‘లక్ష్మీ మల్లేశం.. పెళ్లయిన కొత్తలో’ పేరుతో సరికొత్త వెబ్ సిరీస్ ప్రారంభించింది. న్యూ ఇయర్ సందర్భంగా తొలి ఎపిసోడ్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మనిషి జీవితంలో కీలక ఘట్టమైన పెళ్లి తర్వాత కొత్త జంటల మధ్య సాగే అనుబంధాలను ఈ సిరీస్‌లో అద్భుతంగా చిత్రించారు. తొలి ఎపిసోడ్‌లో కొత్త పెళ్లికూతురు లక్ష్మి పుట్టింటిని, తల్లిదండ్రులను తలచుకుని బాధపడడం, మల్లేశం ఆమెను అనునయించం, ఇంట్లో ఆమె ఒంటరితం, ఆఫీసులో అతని పని గొడవలను సున్నిత హాస్యంతో, చక్కని భావోద్వేగాలతో చూపారు. లక్ష్మిగా కుశాలిని, మల్లేశంగా ఆనంద్ రాజ్ బేతి నటిస్తున్నారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి మైక్ టీవీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు వీరస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. సీఈఓగా సతీశ్ మంజీర, ఎడిటర్‌గా కుంబం ఉదయ్, డీఓపీగా తిరుపతి వ్యవహరిస్తున్నారు.