లక్ష్మీస్ ఎన్టీఆర్ బ్రేక్‌పై న్యాయపోరాటం చేస్తా.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీస్ ఎన్టీఆర్ బ్రేక్‌పై న్యాయపోరాటం చేస్తా.. వర్మ

March 17, 2019

ఏపీలో టీడీపీ ప్రభుత్వం తన పంతాన్నే నెగ్గించుకుంది. వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అడ్డుకుంటామని మొదటినుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ సినిమాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠకు భంగం కలిగేలా చూపిస్తున్నారని  సెన్సార్ అధికారులను కలిసి ఫిర్మాదు చేశారు. ఎన్నికలకు ముందు కుట్ర పూరితంగా ఈ సినిమాను విడుదలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, సెన్సార్ బృందం చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చింది. విడుదల సమయం దగ్గర పడుతున్న టైంలో తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి ఈసీకి ఫిర్యాదు చేయడంతో సెన్సార్ ఈ నిర్ణయం తీసుకుంది.

దీంతో సినిమాను ఆపాలని సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెన్సార్ తెలిపింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో వర్మ న్యాయపోరాటం చేస్తానని ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు. సినిమా విడుదల ఆగడంతో టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కానీ, వర్మ మాత్రం తాను అనుకున్న తేదీకి సినిమాను కచ్చితంగా విడుదల చేస్తానని పంతం పట్టుకున్నట్టే మాట్లాడుతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా విడుదలకు నోచుకుంటుందా లేదా అనేది.  ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సినిమా విడుదలైన తరువాతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. నిజంగా ఓటర్లను ప్రభావితం చేసే సన్నివేశాలు ఆ సినిమాలో ఉంటే రిలీజ్ తరువాత చర్యలు తీసుకుంటామని.. విడుదలను ఆపడం కుదరదన్నారు ఈసీ.