రామమందిర ప్రధాన నిర్మాణానికి శంకుస్థాపన: యోగి ఆదిత్యనాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

రామమందిర ప్రధాన నిర్మాణానికి శంకుస్థాపన: యోగి ఆదిత్యనాథ్

June 1, 2022

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిర ప్రధాన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ‘దేవాలయం నిర్మాణం కోసం 500 ఏళ్ల పోరాటం ముగిసింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ దేవాలయ నిర్మాణ సాధన ఉద్యమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పాత్ర మరువలేనిది” అని యోగి అన్నారు. అనంతరం రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. రామమందిర నిర్మాణం చేపట్టిన ఇంజినీర్లను యోగి ఆదిత్యనాథ్ సన్మానించారు.

మరోపక్క రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలో ఆలయ నిర్మాణానికి 2019లో సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా హాజరయ్యారు. రామ మందిర ప్రధాన నిర్మాణానికి 11 మంది అర్చకులు పూజలు జరిపారు.