ప్రముఖ ఈకామర్స్ సంస్థ, ఐటీ దిగ్గజం అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు షురూ అయ్యింది. ఏకంగా 18వేల మందిని తొలగించారు. ఇందులో భారత్ లోని వేలాదిమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ ధృవీకరించారు. తొలగింపులు ప్రారంభమయ్యాయని…కంపెనీకి చెందిన వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారని వెల్లడించారు. గతంలో అమెజాన్ కంపెనీ భారత్ లో వెయ్యికంటే ఎక్కుమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచించాయి. గతవారం కంపెనీ సీఈవో కూడా తన బ్లాగ్ లో ఉద్యోగుల తొలగింపుల గురించి ప్రస్తావించారు.
కాగా మీడియా నివేదికల ప్రకారం ఇండియాలో గురగ్రామ్, బెంగళూరు అమెజాన్ ఇతర కార్యాలయాల్లో ఇప్పటికే లేఆఫ్ లు ప్రారంభం అయ్యాయి. కంపెనీ తొలగించిన ఉద్యోగుల్లో ఫ్రెషర్స్ తోపాటు ఎక్సీపీరియన్స్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
ఐదు నెలల జీతం :
కంపెనీ తొలగించిన ఉద్యోగులకు ఐదునెలల జీతం అడ్వాన్స్ గా అందజేస్తున్నట్లు సిబ్బందికి ఈమెయిల్ పంపింది. ఈ తొలగింపులు రాబోయే వారాలపాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.
పెద్ద తొలగింపు:
18వేల మంది ఏకకాలంలో తొలగించిన అమెజన్ లో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద తొలగింపు ఇదే అవుతుంది. లేఆఫ్ లు అంటే తాజా ఉద్యోగుల కోతలు వర్క్ ఫోర్స్ లో దాదాపు 1శాతం మాత్రమే. కాగా కంపెనీకి వరల్డ్ వైడ్ గా 350,000మంది ఉద్యోగులు ఉన్నారు. గతేడాది టెక్ పరిశ్రమలో 1.5లక్షల ఉద్యోగులను తొలగించారు. కొత్తఏడాదిలో ఈ కొత కొనసాగుతోంది.