బడా టెక్ కంపెనీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ మధ్యే సెర్చ్ ఇంజన్ గూగుల్ నుంచి లేఆఫ్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పెద్ద కంపెనీ ఐబీఏం నుంచి కూడా అలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 3900మంది ఉద్యోగులను లేఆఫ్ ప్రక్రియలో భాగం కావాల్సివచ్చిందని కంపెనీ తెలిపింది. బుధవారం ఉద్యోగుల కోత గురించి ఐబీఏం క్రాప్ ద్వారా సమాచారం అందించింది. ఉద్యోగుల తొలగింపునకు గల కారణాన్ని కూడా కంపెనీ వివరించింది. ఈ సారి వార్షిక లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని…నాలుగో త్రైమాసికంలో లక్ష్యఆదాయాన్ని సాధించడంలో కూడా కంపెనీ వెనకబడిందని కంపెనీ తెలిపింది.
కంపెనీ సీఎఫ్ఓ జేమ్స్ కవనాగ్ మాట్లాడుతూ…ఉద్యోగుల తొలగింపు తర్వాత కూడా కంపెనీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇదేకాకుండా లేఆఫ్ కారణంగా జనవరి నుంచి మార్చి వరకు 300మిలియన్ల డాలర్ల ఛార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ షేర్లు 2శాతానికి తగ్గాయని తెలిపారు. నిజానికి IBM కంటే ముందే ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, వీటిలో చాలా కంపెనీలు ఆర్థిక మాంద్యం భయమే ఉద్యోగులను తొలగించడానికి కారణమని తెలిపాయి. టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ గత ఏడాది చివరి నెలల్లోనే ప్రారంభమైంది. ఓ నివేదిక ప్రకారం…ఇప్పుడు టెక్ కంపెనీల నుండి దాదాపు 1.50 లక్షల మంది ఉద్యోగులు రిట్రెంచ్మెంట్ ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తోంది.