Layoffs Tention In IT Employess
mictv telugu

ఐటీ ఉద్యోగుల్లో కలవరం

November 12, 2022

లక్షల్లో ప్యాకేజీలు…ప్రపంచంలోనే టాప్ కంపెనీలు.. బిందాస్ లైఫ్.సాప్ట్‌వేర్ జాబ్ అంటే స్మార్ట్ లైఫ్. టైమ్‌కి జీతాలు. వీకెండ్ పార్టీలు..వర్క్ ఫ్రమ్ హోమ్.జాబ్ గురించి టెన్షనే అక్కర్లేదు.. ఇది అంతా ఇప్పటిదాకా..ఇప్పుడు ఒకటే టెన్షన్. ఏ రోజు ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు. ఉద్యోగం ఉంటుందా..ఊడుతుందా? పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి? సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఇఎమ్ఐలు ఎలా కట్టాలి? ఐటీ రంగానికి గడ్డుపరిస్థితులు రాబోతున్నాయా?ఆర్థిక మాంద్యం ప్రభావం ఎన్నాళ్లు ఉంటుంది?

ఒకటే టెన్షన్

ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఊస్టింగ్ వార్తలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఆర్థిక మాంద్యం దిగ్గజ కంపెనీల్ని భయపెడుతుంది. ముప్పు నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఉద్యోగుల తొలగింపే ఫస్ట్ ఆప్షన్‌గా పెట్టుకున్నాయి. ఒకేసారి వేల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. పింక్ స్లిప్పుల్ని యమ స్పీడ్‌గా పంపుతున్నాయి. ప్రసూతి సెలవుల్లో మహిళా ఉద్యోగుల్ని సైతం వదలడం లేదు. కొందరికి జాయిన్ అయిన రెండు నెలలకే ఊస్టింగ్ ఆర్డర్స్ పంపాయి. మెయిల్ ఓపెన్ చేయాలంటేనే ఐటీ ఉద్యోగులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.

ఊస్టింగ్ లెక్కల్లో

ఆర్థిక మాంద్యం భయాలు దిగ్గజ కంపెనీలను వణికిస్తున్నాయి. మెటా,ట్విట్టర్‌లాంటి దిగ్గజ కంపెనీల నుంచి చిన్నకంపెనీల వరకు ఉద్యోగాలకు కోతపెడుతన్నాయి. మెటాలో 11,000, ట్విట్టర్ 3.500, బైజుస్ 2,500 స్పాప్ 1,300,మైక్రోసాఫ్ట్ 1,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇంటెల్ 20శాతం ఉద్యోగాలు, స్ట్రైప్ 14 శాతం ఉద్యోగాలకు కోత పెట్టాయి. అమెజాన్ , యాపిల్ కంపెనీలు రిక్రూట్ మెంట్స్ ఆపేశాయి. డిస్ని కూడా ఈ ఏడాది పెద్దయెత్తున ఉద్యోగుల్ని తొలగించబోతుంది.ఇవే కాదు మరికొన్ని కంపెనీలు ఇదే తోవలో నడుస్తాయని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

పేరుకే దిగ్గజాలు

పేరుకే దిగ్గజ కంపెనీలు..ఆర్థిక మాంద్యం భయాలు మొదలైన వెంటనే ఉద్యోగుల్ని తొలిగించేస్తున్నాయి. భారం తగ్గించుకోవడం అంటే తొలుత ఉద్యోగులనే భావిస్తున్నాయి. మరో ఆలోచన చేయకుండా ఊస్టింగ్ ఆర్డర్లు చేతిలో పెడుతున్నాయి. కనీస మానవత్వాన్ని కంపెనీలు మరుస్తున్నాయి. “వేలకోట్ల లాభాలు వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగులు గుర్తుకురారు. ఆ టైంలో వారిని అసలు పట్టించుకోవు. ఆర్థిమాంద్యం ముప్పు ముంచుకొస్తుందంటే ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేస్తున్నాయి. ఇదేం అన్యాయం” అని సాఫ్ట్ వేర్ కంపెనీ బాధిత ఉద్యోగులు వాపోతున్నారు.