భర్తను కోసి కూర వండుకుంది.. లేజీ ఫెలో అని... - MicTv.in - Telugu News
mictv telugu

భర్తను కోసి కూర వండుకుంది.. లేజీ ఫెలో అని…

May 14, 2022

భర్త ఇంట్లో సోమరిపోతుగా తిని కూర్చోవడమే కాకుండా తరచూ గొడవ పడుతున్నాడని ఓ మహా ఇల్లాలు ఘోరాతిఘోరానికి పాల్పడింది. అతణ్ని చంపి, ముక్కలు కోసి కూర వండింది. చివరికి వృషణాలను కూడా వదిలేయకుండా అవెన్‌లో ఫ్రై చేసింది. సెర్బియాలో ఈ దారుణం జరిగింది. థెరిసా పెరిక్(46), సర్జాన్ పెరిక్ (42) భార్యాభర్తలు. థెరిసాకు అతడు ఐదో భర్త. సర్జాన్ ఇంట్లో సోమరిపోతుగా పడున్నాడని ఆమె గొడవ పెట్టుకునేది.

గొడవలు ఈ నెల 10న తారస్థాయికి చేరాయి. థెరిసా భర్తను చంపేసి, రంపంతో ముక్కలు చేసింది. థెరిసాకు మాజీ భర్త ద్వారా పుట్టిన కూతురు ఎల్జే ఈ ఘాతుకాన్ని చూసి జడుసుకుని ఇరుగుపొరుగువారికి చెప్పింది. భర్తను చంపడానికి థెరిసా గతంలో బెడ్రూంలో మంట పెట్టినట్లు తెలిసింది. థెరిసా, సెర్జాన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, థెరిసా డ్రగ్స్ తీసుకునేదని విచారణలో వెల్లడైంది.