ఈయన ఎవరో చెబితే దీపావళి గిఫ్ట్.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

ఈయన ఎవరో చెబితే దీపావళి గిఫ్ట్.. వర్మ

October 26, 2019

Leader character in kamma rajyamlo kadapa redlu rgv Diwali gift 

మాఫియా, మసాలా సినిమాలు వదిలేసి రాజకీయాలపై అడ్డంగా, నిలువుగా పడిపోయిన ఆర్జీవీ తాజా చిత్రం కోసం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ చిత్రంలోని పాత్రలను ఒకటొకటే పరిచయం చేస్తున్న వర్మ తాజాగా ఓ ఫోను ట్వీట్ చేశారు. అందులో ఓ నాయకుడు రెండు చేతులు పైకెత్తి జనంతో మాట్లాడుతున్నారు. అతనెవరో చెబితే దీపావళి గిఫ్ట్ ఇస్తానని వర్మ చెప్పారు. ఆ నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని సులువుగానే అర్థమయ్యేలా ఉంది ఫొటో. జగన్ స్టయిల్లో రెండు చేతులు పైకెత్తిన ఈ పాత్రను వర్మ నిజానికి ఇప్పటికే పోస్టర్లలో పరిచయం చేశారు. 

ఈ చిత్రంలో గుప్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పాత్రలను వర్మ ఇప్పటికే పరిచయం చేశాడు. పవన్ పాత్రను కావాలనే అమ్మాయిల మధ్య ఉంచాడని తిట్టించుకుంటున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది.