Leaders who are ready to plant the feet of voters in Munugoda.. Do you know why?
mictv telugu

ఓటర్ల కాళ్లు మొక్కడానికి సిద్దమైన నాయకులు..ఎందుకో తెలుసా?

August 20, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఉప ఎన్నిక ప్రస్తుతం ఆయా పార్టీలకు సవాల్‌గా మారింది. మునుగోడు గడ్డపై జెండాను ఎగరవేయడం కోసం పార్టీల అధిష్టానాలు వినూత్నంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మునుగోడు నియోజకవర్గంలోని లక్ష మంది ఓటర్ల కాళ్లను మొక్కడానికి సిద్దమైంది.

మునుగోడులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా ఇంటింటికీ వెళ్లి లక్ష మంది కాళ్లు మొక్కి, ఓట్లు అడగాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం రేవంత్‌రెడ్డి అభిమానులు వెయ్యిమంది రంగంలోకి దిగారు. వీరందరితో కలిసి కాంగ్రెస్ ఓ స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. ఓ వైపు పార్టీ నేతల ప్రచారంలో బిజీగా ఉంటే, ఇంకొవైపు రేవంత్‌ బృందం ఓటర్ల కాళ్లు మొక్కేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

మరోవైపు మునుగోడులో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించేందుకు  అధిష్టానం సిద్దమైంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా రేపు మునుగోడులో భారీ సభకు సన్నాహాలు చేస్తుంది. ఈ సభకు కేంద్రమంత్రి అమిత్ షా రాబోతుండడంతో మునుగోడు మండలం ఆయా పార్టీల జెండాలతో రెపరెపలాడుతుంది. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ ఈ సరికొత్త ప్రచారానికి తెరలేపటం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.