నాయకత్వమంటే మా నాన్నదే! - MicTv.in - Telugu News
mictv telugu

నాయకత్వమంటే మా నాన్నదే!

August 22, 2017

నాయకత్వం అంటే పదవులు, హోదాలు, బిరుదులు కాదని..  ఇతర వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయడమే అని కేటీఆర్ అంటున్నారు. ఇందుకు తన తండ్రే ఉదాహరణ అని చెబుతున్నారు. కేటీఆర్ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి ఈ విధంగా రాశారు.. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్  పంటపొలాల్లో పనిచేస్తున్న కేసీఆర్  పాత ఫోటోలను  కేటీఆర్ ట్విట్టర్లో పెట్టారు. ఇటీవలల కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ 2017 అవార్డు ప్రకటించడం తెలిసిందే. దీనిపై  ప్రతిపక్షాలు కూడా అదే స్ధాయిలో విమర్శలు చేయడం కూడా చూస్తున్నాం. వ్యవసాయంతో పాటు ఆత్మహత్యల్లో కూడా  తెలంగాణ… దేశంలో రెండవ స్ధానంలో ఉందని ప్రతిపక్షాలు పదే పదే గుర్తు చేస్తున్నాయి.ఈ క్రమంలో కేటీఆర్  ట్విట్టర్ లో పోస్ట్ చేసిన  ఫోటోతోపాటు వాఖ్యానంలో చాలా అర్థాలే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కాకముందటి  ఫోటోలను పోస్టు చేయడంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది.ఈ ఫోటోల్లో ఇంకో విశేషం కూడా ఉంది.