లీకైన 'సాహో' స్టిల్.. క్షణాల్లో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

లీకైన ‘సాహో’ స్టిల్.. క్షణాల్లో వైరల్

April 14, 2019

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘సాహూ’ సినిమాకు సంబంధించిన ఫొటో ఒకటి లీక్‌ అయ్యింది. ఈ ఫొటోలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా కనిపించారు. పాట చిత్రీకరణ సమయంలో ఈ ఫొటోను తీసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌లు ఒకర్నొకరు ప్రేమగా చూసుకుంటూన్నారు. ఈ ఫొటోలో వీరి జంట చూడచక్కగా ఉందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో లీకైయిన కొన్ని క్షణాల్లోనే వైరల్ కావడం గమనార్హం.

Leaked pictures from ‘Saaho’ sets go viral on the internet

ఈ చిత్రానికి రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్‌ దర్హకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.