మహిళలకు రాత్రిళ్లు ఉచిత ప్రయాణం.. పోలీసు వాహనాల్లో! - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలకు రాత్రిళ్లు ఉచిత ప్రయాణం.. పోలీసు వాహనాల్లో!

December 2, 2019

Women 02

నిత్యం మహిళలపై హత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ.. ఇలా చెప్పుకుంటే దేశంలో ప్రతీ 15 నిమిషాలకు ఒక ఘటన జరగుతోంది. వీటిని నివారించడానికి పంజాబ్‌లోని లుథియానా పోలీసులు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాత్రివేళ మహిళలు ప్రయాణానికి ఇబ్బందిడకుండా పోలీసులే తమ సొంత వాహనాల్లో వారిని గమ్యస్థానానికి చేర్చనున్నారు. ఇందుకోసం 1091, 78370 18555 హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. 

నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మేము తెలిపిన  నంబర్లకు ఫోన్ చేస్తే పోలీసులు అందుబాటులోకి వస్తారు. మా వాహనాల్లోనే ఉచితంగా గమ్యస్థానానికి చేరుస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏడాది పొడవునా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది’ అని వెల్లడించారు. హైదరాబాద్‌లో యువ వైద్యురాలు దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న క్రమంలో లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసుల నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.