గతకొన్ని రోజులుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ క్షణంలో ఇరు దేశాల మధ్య యుద్దం జరుగుతుందోనని ఆ దేశ ప్రజలు, అధికారులు, నాయకులు భయాందోళనకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో ‘మా దేశం నుంచి భారతదేశ విద్యార్ధులు తక్షణమే వెళ్లిపోవాలి’ అని ప్రకటన విడుదల చేసింది.
“మెడికల్ యూనివర్శిటీల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ గురించి తెలుసుకోవడానికి భారత రాయబార కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అయితే, భారత దేశ విద్యార్ధులు తమ విద్యా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుగా ఆన్లైన్ క్లాసుల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. క్లాసుల విషయంలో యూనివర్సిటీల నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూడకుండా మీ భద్రత దృష్ట్యా తక్షణమే ఉక్రెయిన్ను వీడాలని సూచిస్తున్నాం” అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.