క్షమాపణ చెప్పండి..క్షణంలోనే వదిలేస్తా: నారా లోకేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

క్షమాపణ చెప్పండి..క్షణంలోనే వదిలేస్తా: నారా లోకేశ్

February 24, 2022

nara

‘సాక్షి’ పత్రిక తమపై అసత్య కథనాలు రాస్తూ, ‘సాక్షి’ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తుందని.. గతంలో నారా లోకేశ్ రూ. 75 కోట్లతో సాక్షిపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం ఆయన విశాఖ కోర్టుకు హాజరైయ్యారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. “పరువు నష్టం దావాకు సంబంధించి కోర్టుకు వచ్చా. నేను వేసిన దావా విషయంలో కావాలనే ఆలస్యం చేశారు. కానీ, న్యాయమూర్తి ఎట్టి పరిస్ధితుల్లో 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని వాళ్లకు ఆదేశాలు ఇచ్చారు.

నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ‘సాక్షి’ నాపై దాడి చేసింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా నాపై బురద జల్లింది. 2019 అక్టోబరులో ‘చినబాబు చిరుతిండి – 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దాన్ని చూసి మరో ఆంగ్ల పత్రిక, మ్యాగజైన్‌లు కూడా కథనాలుగా ప్రచురించాయి. వాళ్ల ముగ్గురికీ నేను నోటీసులు జారీ చేశాను. అందులో మ్యాగజైన్ క్షమాపణ చెప్పింది. కానీ సాక్షి, మరో పత్రికలు మాత్రం క్షమాపణ చెప్పలేదు. దాంతో నేను సాక్షిపై పరువునష్టం దావా వేశా. క్షమాపణ చెప్పే వరకూ పోరాడుతా. క్షమాపణలు చెప్తే.. క్షణంలోనే ఈ పోరాటం ఆపేస్తా” అని లోకేశ్ అన్నారు.