Lecturer Sumangali was rushed to Anantapur Hospital by Arts College staff
mictv telugu

ఏపీ : క్లాస్‌‌రూంలో లెక్చరర్ గొంతు కోసిన భర్త

November 17, 2022

Lecturer Sumangali was rushed to Anantapur Hospital by Arts College staff

అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్లాస్‌రూంలో విద్యార్ధులు చూస్తుండగానే మహిళా లెక్చరర్‌‌పై ఆమె భర్త హత్యాయత్నం చేశాడు. దీంతో భీతావహ వాతావరణం నెలకొనగా, విద్యార్ధులు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకెళితే.. 20 ఏళ్లు గుంటూరులో లెక్చరర్‌‌గా పని చేసిన సుమంగళి ఏడాది క్రితం అనంతపురం ఆర్ట్స్ కాలేజీకి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చి శ్రీనివాస నగర్‌‌‌లో నివాసం ఉంటోంది. అయితే భర్త పరేశ్‌తో విభేదాల కారణంగా సుమంగళి విడాకులు కావాలని కోర్టులో కేసు వేసింది.

ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలోనే భర్త ఆమెపై దాడి చేశారని తెలుస్తోంది. గురువారం తరగతి గదిలోకి దూసుకొచ్చిన పరేశ్.. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోశాడు. వెంటనే అప్రమత్తమైన విద్యార్ధులు, కళాశాల సిబ్బంది తీవ్రగాయాల పాలైన సుమంగళిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి ఆందోనకరంగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించి, భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.