"తోక పార్టీలే" గెలిపించాయా? - MicTv.in - Telugu News
mictv telugu

“తోక పార్టీలే” గెలిపించాయా?

November 6, 2022

మునుగోడు తీర్పులో వామపక్షాలు కీలక పాత్ర పోషించాయి. గులాబీ దళానికి అన్నింట్లో సహకరిస్తూ ముందుకు సాగాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువు చేశారు. లెఫ్ట్ పార్టీలు ఓటు బ్యాంక్‌ను పక్కాగా కారువైపు డైవర్ట్ చేశాయి. ప్రతి మండలంలో బీజేపీకి షాక్ ఇచ్చేలా చేశాయి.

సూది, దబ్బడం పార్టీలు

మునుగోడు ఎన్నికలకు ముందు వామపక్షాలపై సీఎం కేసీఆర్ తనదైన స్టయిల్‌లో విరుచుకుపడ్డారు. ఇద్దరు.ముగ్గురు కలిసి కిరికిరి చేస్తున్నారని చాలా సభల్లో మండిపడ్డారు. తోకపార్టీలతో ఏం ఒరిగేది ఉండదని ఘాటుగా విమర్శించేవారు. సూది, దబ్బడం పార్టీల పని అయిపోయిందన్నారు. గల్లీల్లో గొడవలకు ఈ పార్టీలు పనికొస్తాయని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అనే వారు. వామపక్షాల్ని పార్టీల కింద ఆయన చూడలేదు. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్..లెఫ్ట్ పార్టీల్ని కేర్ చేయలేదు.సాధ్యమైనంతవరకూ తెలంగాణభవన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో పెట్టేవారు.కానీ మునుగోడు ఉపఎన్నిక వచ్చేసరికి సీఎం కేసీఆర్ మైండ్ సెట్ మారింది.

మునుగోడులో రారమ్మని…

మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టుల అవసరాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. వీరు లేకపోతే బీజేపీని దెబ్బకొట్టడం కష్టమని భావించారు. వామపక్ష నేతల్ని పిలిచి మరి మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. వేదికలపై వామపక్ష నేతల్ని కేసీఆర్ ఆకాశికెత్తారు. ఎక్కడ గతంలో తను తిట్టిన తిట్లు గుర్తురాకుండా ఉండేలా ప్రశంసలు కురిపించారు. ఇదే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపులో కీలకమైంది. లెఫ్ట్ ఓటు బ్యాంక్ అంతా కారువైపు క్రాస్ అయింది.

పార్టీ పిలుపునిస్తేకమ్యూనిస్ట్ కార్యకర్తలు పార్టీ పిలుపునిస్తే గీత దాటరు. పార్టీ లీడర్స్ లైన్‌ని అసలు క్రాస్ చేయరు. మునుగోడు ఉప ఎన్నికల్లో అదే చేశారు. టీఆర్ఎస్ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. చాలా మండలాల్లో వందల్లో ఉన్న ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడేలా చూశారని టాక్. మొత్తానిక తోకపార్టీలే కారుని టాప్ గేర్‌లో నడిపించాయి.