21 ఏళ్లు ఉంటేనే దమ్ము కొట్టాలి.. కొత్త రూల్స్!  - MicTv.in - Telugu News
mictv telugu

21 ఏళ్లు ఉంటేనే దమ్ము కొట్టాలి.. కొత్త రూల్స్! 

February 24, 2020

Legal age for smoking to be raised from 18 to 21 years old

కాలేజీ యువత చిన్నవయసులోనే స్మోకింగ్ బారిన పడుతున్నారు. పొగ తాగడానికి ఆ వయసు నుంచే ఆకర్షితులు అయి దాని బారిన పడి వ్యసనపరులు అవుతున్నారు. అదే ఓ ఫ్యాషన్‌గా భావించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ధూమపానాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది. అయినా ఎవరిలో మార్పు రావడంలేదు. దీంతో కేంద్రం మరో ఆలోచనకు పూనుకుంది. 

స్మోకింగ్ చేసే వారి కనీస వయస్సును మార్చింది. ఇప్పటి నుంచి 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై చట్టంలోని నిబంధనలను ఈ మేరకు కఠినతరం చేస్తోంది. ఇందుకోసం ఓ న్యాయ నిపుణుల బృందాన్ని కూడా ఏర్పరించింది. 

న్యాయ నిపుణుల నిబంధనలు ఇలా.. పాటించకపోతే కఠిన శిక్షలే..

  1. స్మోకింగ్ చేయడానికి వయోపరిమితి మార్పు
    2. ఇప్పుడున్న 18 సంవత్సరాల వయస్సును 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు
    3. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పెంపు
    4. కొత్తగా ట్రాకింగ్ విధానంతో పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను అక్రమంగా అమ్మినవారిని గుర్తిస్తారు
  2. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగటం నిషేధం