legal construction at the residence Noida noida administration bulldogging
mictv telugu

బీజేపీ కార్యకర్త ఇల్లు బుల్డోజర్‌తో కూల్చివేత

August 8, 2022

కథ అడ్డం తిరిగింది. నిరసనల్లో రాళ్లు రువ్వుతున్నారంటూ కొంతమంది ముస్లింల ఇళ్లను ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర చోట్ల బుల్డోజర్లతో కూల్చేస్తుండడం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో ఓ బీజేపీ కార్యకర్త ఇంటిని కూడా బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు.

నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌసింగ్ సొసైటీకి చెందిన శ్రీకాంత్‌ త్యాగి అనే బీజేపీ కార్యకర్త ఇటీవల ఆ ప్రాంతంలోని ఓ మహిళపై దాడి చేశాడు. బండ బూతులు కూడా తిట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో త్యాగి పారిపోయాడు. పోలీసులు, మునిసిపల్ సోమవారం త్యాగి ఇంటికి వెళ్లి ముందు భాగాన్ని కూల్చేశారు. ఆ భాగాన్ని అక్రమంగా నిర్మించినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. అయితే నాలుగేళ్ల కిందటే ఆ భాగం కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసిన అధికారులు ఇంత ఆలస్యంగా స్పందించడం విమర్శలకు తావిస్తోంది.