51 ఏండ్ల వయసులో హీరోగా.. ఎవరీ లెజెండ్?
శరవణ స్టోర్స్.. తమిళనాడుకు చెందిన ఈ టెక్స్‌టైల్, జ్యూవెలరీ, గార్మెంట్, ఎలక్ట్రానిక్ స్టోర్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఈ స్టోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ సంస్థ ఫౌండర్ అరుళ్ శరవణన్.. స్థార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ చేశాడు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా హీరో అవతారమెత్తాడు. శరవణన్ హీరోగా ది లెజెండ్(The Legend )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో శరవణన్ స్వీయ నిర్మాణంలో ”ది లెజెండ్” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు జీడీ-జెర్రీ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా జూలై 28న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.
నటనకు వయసు అడ్డం కాదు అన్నట్లుగా.. లేటు వయసులో అంటే 50 ఏండ్ల వయస్సులో హీరో అయ్యాడు ఈ లెజెండ్ శరవణన్. ఆయన మూవీపై సటైర్లు, జోకులు పేలుతున్నాయి. ఇందులో ఊర్వశి రౌతెలా కీలక పాత్రలో నటించింది. తన స్టోర్స్ కు హీరోయిన్లతో బ్రాండ్ ప్రమోషన్ చేసిన శరవణన్ ఇప్పుడు అదే హీరోయిన్ల పక్కన హీరోగా ఎదిగాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ కూడా ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దాదాపు సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్లందరూ వచ్చి సందడి చేశారు. మార్చి 3, 2022న ఈ సినిమాకు ‘ది లెజెండ్’ అనే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇందులో శరవణన్ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శరవణన్ వ్యక్తిగత విషయాలకు వస్తే, ఆయనకు సూర్యశ్రీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. ఇక ఈ సినిమా శరవణన్‌కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో.. అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో రేపటి వరకూ వేచి చూడాల్సిందే.