legendary actor kantarao family in poverty
mictv telugu

దుర్భర జీవితంలో దిగ్గజ నటుడు కాంతారావు కుటుంబం

November 17, 2022

legendary actor kantarao family in poverty

ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే ముందే.. ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ నటుడు కాంతారావు. పౌరాణిక యాక్షన్ సీన్స్ కి పెట్టింది పేరైన కాంతారావు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు. వరుస సూపర్ హిట్స్ తో కుబేరుడి జీవితాన్ని అనుభవించాడు. అయితే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసే గుణం కాంతారావుని నిండా ముంచేసింది అంటారు. కుటుంబం కోసం ఆలోచించకుండా పెద్ద ఎత్తున అప్పట్లో కాంతారావు ఆర్థిక సహాయం చేసేవాడట.

ఈ రోజు ఉన్నత స్థితిలో ఉన్న ఎంతో మంది నటీ నటులకు లక్షలకు లక్షలు కాంతారవు దానం చేశాడట. దీనికి తోడు ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని రోడ్డున పడ్డాడట కాంతారావు. దాంతో తన చివరి రోజుల్లో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాంతారావు. అయితే ఆయన చనిపోయిన తరువాత తన కుటుంబం ఇప్పుడు మరింత దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సిటీలో కనీసం ఇంటి అద్దె కట్టుకోలేక నగర శివారుల్లో చిన్న అద్దె ఇంట్లో ఉంటు.. చాలా ఇబ్బందికర పరిస్థితిలో కాంతారావు కుటుంబం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన శతజయంతి వేడుకలకు హాజరైన కాంతారావు కుమారుడు రాజా తమ పేదరికం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం లోని గుడిబండ అనే చిన్న గ్రామంలో జన్మించారు కాంతారావు. చిన్నప్పటి నుండి ఎన్నో నాటకాలలో వేషాలు వేసి.. ఆపై సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలితరం యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో కాంతారావు కత్తి తిప్పటం చూసిన అభిమానులు కత్తి కాంతారావుగా బిరుదు ఇచ్చారు. కాంతారావు కత్తి తిప్పే విధానం చూసి న్టీఆర్, నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలే బెంబేలెత్తి పోయేవారట. అలాంటి కాంతారావు ఫ్యామిలి ఇప్పటి పరిస్థితి చూసి అందరు భావోద్వేగానికి గురవుతున్నారు. కాంతారావు శతజయంతి వేడుకల్లో కుమారుడు రాజా మాట్లాడుతూ. .’తమ తండ్రి సినిమాలలో నటించే టప్పుడు పెద్ద బంగళా లో వుండే వారమని.. తర్వాత కొన్ని సినిమాలు స్వయంగా తీసి నష్టాలు రావటంతో నాన్నగారు ఆస్తులు మొత్తం అమ్మేసారని.. నాన్న చనిపోయిన తర్వాత తాము మరింత పేదరికంలో వున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పారు రాజా.