యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ దేవ్ ఇంటికి! - MicTv.in - Telugu News
mictv telugu

యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ దేవ్ ఇంటికి!

October 25, 2020

legendary cricketer Kapil Dev discharged from hospital

టీమిండియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌కు రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. గత శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంటకు ఆయనకు ఛాతిలో తీవ్ర నొప్పి వచ్చింది. దాంతో అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్‌ హార్ట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. 

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించారు. ప్రస్తుతం కపిల్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. హరియాణ హరికేన్‌గా పేరొందిన కపిల్‌ సారథ్యంలోని భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ ఘట్టం ఆధారంగా ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమా రూపొందుతోంది. ’83’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.