‘మరణ’ వార్తపై ఎస్.జానకి ఆవేదన.. ఎందుకిలా? - MicTv.in - Telugu News
mictv telugu

‘మరణ’ వార్తపై ఎస్.జానకి ఆవేదన.. ఎందుకిలా?

June 29, 2020

Legendary Singer janaki's Son Reveals She’s Fine And Recovering From Surger

సోషల్ మీడియాలో నకిలీ వార్తలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలెబ్రిటీల గురించి ఎన్నో నకిలీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు సెలెబ్రెటీలకు సోషల్ మీడియాలో పెళ్లి చేస్తున్నారు. మరికొందరు సెలెబ్రెటీలకు పిల్లలు పుట్టిస్తున్నారు. మరికొందరు ఏకంగా కొందరు సెలెబ్రిటీలను చంపేస్తున్నారు. 

తాజాగా లెజండరీ సింగర్ జానకి ఈ నకిలీ వార్తల బారిన పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మైసూర్‌లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ఇటువంటి రూమర్స్‌ ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమెకు ఓ ఆస్పత్రిలో చిన్న శస్త్రచికిత్స జరిగింది. దీంతో జానకి గారి ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జానకిపై వస్తున్న తప్పుడు వార్తలపై ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో విడుదల చేశారు.