మీరు డాక్టరా? నర్సా? అయితే గ్రీన్ కార్డు వచ్చేసినట్లే  - Telugu News - Mic tv
mictv telugu

మీరు డాక్టరా? నర్సా? అయితే గ్రీన్ కార్డు వచ్చేసినట్లే 

May 9, 2020

Legislation introduced in US to give Green Cards to foreign nurses, doctors

కరోనా వైరస్ భయంతో వణుకుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డులను పెద్ద సంఖ్యలో విదేశఈ డాక్టర్లను, నర్సులకు కేటాయించాలని నిర్ణయించింది. దీనికోసం చట్టసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఎవరికీ కేటాయించని 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు. హెల్త్ కేర్ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ చట్టం కింద నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను పంపిణీ చేసే అధికారం పార్లమెంటు(కాంగ్రెస్)కు ఉండడంతో బిల్లు దాదాపుగా ఆమోదించినట్లే. 

అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యసిబ్బందిని పెంచుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 12లక్షల కేసులు నమోదు కాగా, 77 వేల మంది చనిపోయారు. చట్టసభలో తీర్మానం నెగ్గి చట్టంగా మారితే 25వేలమంది నర్సులు, 15వేల మంది డాక్టర్లకు గ్రీన్‌కార్డులు వస్తాయి. అయితే వారు కరోనా చికిత్స పాల్గొనాల్సి ఉంటుంది. హెచ్‌-1బీ, జే2 వీసాలు ఉన్నవారికి ఇది చక్కని అవకాశం.