Leh police caught the accused within three hours
mictv telugu

మహిళపై అత్యాచారం, హత్య.. మూడు గంటల్లో పట్టుకున్న పోలీసులు

September 1, 2022

మన దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి క్రూర నేరాలు రోజూ జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా వాటిల్లో నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం జరిగి, తద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే లద్దాఖ్‌లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని మూడు గంటల్లోనే అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో 32 ఏళ్ల రిగ్జిన్ దావా అనే వ్యక్తి బుధవారం తెల్లవారు జామున 55 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించి అనుమానాస్పదంగా ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతడే హత్య చేశాడని తేలడంతో అరెస్ట్ చేశారు. నిందితుడి మెడ, భుజాలపై గోర్లతో రక్కిన గాయాలు, రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అలాగే మహిళ లోదుస్తులు, నిందితుడి శరీరంపై ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కేసులో సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున నిందితుడికి కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని పోలీసు అధికారి నిత్య వెల్లడించారు. కాగా, పోలీసుల పనితీరుపై స్థానికంగా ప్రశంసలు వస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్న తీరును స్థానికులు అభినందిస్తున్నారు.