ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్..వీడియో

May 14, 2019

సాంకేతికత రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఫోల్డబుల్‌ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. శాంసంగ్‌ ఇప్పటికే ఫోల్డబుల్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో మిగిలిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థలు కూడా ఫోల్డబుల్‌ ఫోన్లపై కసరత్తు చేస్తున్నాయి.

లెనోవో సంస్థ ఇంకో ముందడుగు వేసి, ఫోల్డబుల్‌ పీసీని రూపొందిస్తోంది. 2020 నాటికి ఈ ఫోల్డబుల్‌ పీసీని మార్కెట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 13.3 అంగుళాలు, 4:3 రేషియోలో ఓఎల్‌ఈడీ 2కే డిస్‌ప్లేతో ఇది విడుదల కానుంది. దీనిని సగానికి మడత పెడితే పుస్తకంలా.. తెరిస్తే పెద్ద సైజు ట్యాబ్లెట్‌లా ఉంది. ‘ప్రీమియం థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 శ్రేణిలోకి ఈ సరికొత్త ల్యాప్‌టాప్‌ వచ్చి చేరనుంది. ఉత్పాదకతలోనూ, విశ్వసనీయతలోనూ అస్సలు రాజీపడే ప్రసక్తేలేదు. ఇది ఫోన్‌కాదు.. ట్యాబ్లెట్‌ అంతకన్నా కాదు, ఇది ఒక ఫోల్డబుల్‌ స్క్రీన్‌ కలిగిన పూర్తిస్థాయి ల్యాప్‌టాప్‌’ అని లెనోవో సంస్థ తెలిపింది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.