ఈ ఫోన్లు భలే చౌక..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఫోన్లు భలే చౌక..!

June 26, 2017

ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో యూజర్లు కొనుగోలు చేసే లెనోవో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. లెనోవో మొబైల్ ఫెస్ట్ పేరిట ఓ సేల్‌ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతోంది. లెనోవో కె6 పవర్ ఫోన్ ధర రూ.1వేయి వరకు తగ్గింది. దీంతో ఈ ఫోన్‌కు చెందిన 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లను వరుసగా యూజర్లు రూ.8,999, రూ.9,999 ధరలకు కొనొచ్చు. ఇక దీనిపై యూజర్లకు రూ.8,500 వరకు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తుంది. లెనోవో వైబ్ కె5 నోట్ ఫోన్ 4జీ మోడల్ రూ.12,499 ధర ఉండగా ఇప్పుడా ఫోన్‌ను రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. ఇదే ఫోన్ 3జీబీ మోడల్ ధర రూ.11,999 ఉండగా ఇప్పుడీ ఫోన్ రూ.9,999 ధరకే వస్తుంది. దీంతోపాటు రూ.9వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. లెనోవో వైబ్ కె5 ప్లస్ రూ.8,499 ధర ఉండగా, ఇప్పుడీ ఫోన్ రూ.7,499 ధరకే దొరకుతుంది. దీనిపై రూ.7వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో అందుబాటులో ఉండగా, ఇవి వరుసగా రూ.12,999, రూ.14,999 ధరలకు వస్తున్నాయి. ఇవి రూ.4వేలు, రూ.3వేల వరకు తగ్గింపు ధరలకు దొరకుతున్నాయి.