రేపోమాపో రష్యా గుప్పిట్లోకి వెళ్లబోతున్న ఉక్రెయిన్ను ఆదుకోడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. మొన్నటివరకు ఆశాదీపంలా నిలిచిన అమెరికా, నాటో దళాలు ‘అణు’ భయంతో హ్యాండ్ ఇచ్చేయడంతో ఉక్రెయిన్ పరిస్థితి దయనీయంగా మారింది. మరోపక్క.. ఆ దేశాన్ని ఆదుకోడానికి హాలీవుడ్ స్టార్ హీరో లియొనార్డో డికాప్రియో ముందుకొచ్చాడు.
ఏకంగా రూ.77 కోట్లను విరాళంగా అందించాడు. డికాప్రియోకు అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లో జన్మించడమే దీనికి కారణం. ఆమె 1917లో తన తల్లిదండ్రులతో కలిసి జెర్మనీకి వెళ్లి స్థిరపడింది. ఆ సెంటిమెంట్‌తోనే డికాప్రియో ఆర్థిక సాయం ప్రకటించారు. జర్మనీకి వెళ్లి అతని అమ్మమ్మ 1943లో లియొనార్డో తల్లి ఇర్మెలిన్కు జన్మనిచ్చింది. తన తల్లిదండ్రులు విడిపోవడంతో లియొనార్డో హెలెన్తోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఆమె 2003లో 93 ఏళ్ల వయసులో చనిపోయింది.