శ్రీవారి మెట్లదారిలో రెచ్చిపోయిన చిరుత.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి మెట్లదారిలో రెచ్చిపోయిన చిరుత..

February 17, 2020

tirumala.

తిరుమలలో చిరుతపులి మళ్లీ రెచ్చిపోయింది. శ్రీవారి మెట్ల మార్గంలోని 270వ మెట్టు వద్ద దుప్పిపై దాడి చేసింది. దుప్పి కళేబరం, రక్తపు మరకలు కనిపించండంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే విజిలెన్స్, అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుప్పి కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించి మెట్లను శుభ్రం చేశారు. దుప్పి శరీరంతో గాయాలు, గాట్ల ఆధారంగా చిరుతపులి దాడి చేసిందని నిర్ధారణకు వచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో కొద్దిసేపు భక్తులను అనుమతించలేదు. 

కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు మార్గాలుంటాయి. ఒకటి అలిపిరి మార్గం, మరొకటి శ్రీవారి మెట్టుమార్గం. అలిపిరి మార్గం 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటుంది. శ్రీవారి మార్గం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ మార్గంలో రాత్రివేళలో భక్తులను అనుమతించరు. ఉదయం 6 తర్వాతే కొండపైకి అనుమతిస్తారు. చిరుతపులి దాడి వెలుగులోకి రావడంతో ఉదయం 7 గంటల నుంచి భక్తులను శ్రీవారి మెట్లు మార్గంలో అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు.