అసోంలోని ఓ చిరతు పులి అలజడి సృష్టించింది. జనావాసంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేసింది. ఈ చిరుత దాడిలో సుమారు 15 మందిని వరకు గాయపడ్డారు. వారిలో ముగ్గరు అటవీ అధికారులు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం అసోంలోని శివార్లలో రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లోకి ప్రవేసించిన చిరుత అందరినీ పరుగులు పెట్టించింది. ఇనిస్టిట్యూట్ కంచెను ఎగురుకుంటూ వచ్చి ఓ కారుపై దాడికి యత్నించింది. అనంతరం సమీపంలోని ప్రజలపై తిరగబడింది. చిరుత దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరిశోధన సంస్థను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నుంచి చిరుత బయటకు వచ్చిందని భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఉండి చిరుతను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చిరుత పులి దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
On Camera, Leopard Leaps Over Fence, Attacks Car https://t.co/AlLPZIw506 pic.twitter.com/MobhcdOx0A
— NDTV (@ndtv) December 27, 2022