అధికారులపై చిరుత పులి దాడి.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

అధికారులపై చిరుత పులి దాడి.. వీడియో వైరల్

May 9, 2022

హర్యానా రాష్ట్రం పానిపట్‌‌లోని బహరంపూర్ గ్రామంలో ఓ చిరుత పులి అటవీశాఖ అధికారులపై పంజా విసిరిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ”చిరుత పులి ఆకస్మాత్తుగా ఓ అధికారిపై దాడి చేసింది. దాంతో పక్కనే ఉన్న మరో అధికారి వెంటనే పరిగెత్తుకు వచ్చి, ఆ చిరుత పులిని పక్కకు పడేశాడు. వెంటనే అతడిపై దాడి చేసింది. అంతలోనే అక్కడే ఉన్న మరికొందరు అధికారులు చిరుత దాడిని అడ్డుకునేందుకు కర్రలతో ప్రయత్నం చేశారు. చివరకు చిరుతపులికి స్పృహ కోల్పోయేలా చేసి, దానిని బంధించారు.”

 

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి శశాంక్ కుమార్ సావన్ మే 8న తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘అటవీశాఖ అధికారులకు కఠినమైన రోజు, వారి ధైర్యానికి వందనం. చివరకు చిరుతతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు’ అంటూ ట్విట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పోలీసుల ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.